ఆఫ్ఘనిస్తాన్ నుండి అమెరికా బలగాలను ఉపసంహరించిన తీరు చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు. ఆఫ్ఘన్‌లో 20 ఏళ్ల సుదీర్ఘ యుద్దానికి పూర్తి ముగింపు పలుకుతూ అమెరికా రక్షణ దళాలు కాబూల్ నుంచి బయల్దేరిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ స్పందిస్తూ బైడెన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. ఆఫ్ఘన్‌లో అమెరికా వదిలేసి వచ్చిన ఆయుదాలు, ఇతర పరికరాలను తక్షణమే వెనక్కి తీసుకురావాలని సూచించారు. యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన 85 బిలియన్ డాలర్లలో ప్రతి పైసా తిరిగి తెచ్చుకోవాలని, ఇవ్వకపోతే సైన్యాన్ని పంపి తెప్పించాలని అన్నారు. లేదంటే బాంబులేసి వాటిని ధ్వంసం చేయాలని విమర్శించారు. ఇలాంటి బలహీనమైన, మూర్ఖత్వపు ఉపసంహరణ ప్రక్రియను ఎవరూ ఊహించలేదన్నారు.