భారత్ సహా అంతర్జాతీయ విద్యార్థులకు బ్రిటన్ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. విద్యార్థుల కుటుంబ సభ్యుల రాకపై నిషేధం విధిస్తూ నిబంధనల్ని ప్రభుత్వం కఠినతరం చేసింది. అంతేగాక పోస్ట్ స్టడీ వర్క్ వీసా (గ్రాడ్యుయేట్ రూట్)పైనా బ్రిటన్ సమీక్ష చేయబోతున్నది. వలస విధానంపై బ్రిటన్ ప్రభుత్వ నిర్ణయాలు భారతీయు విద్యార్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. స్టూడెంట్ వీసా కొత్త నిబంధనలు సోమవారం నుంచి అమల్లోకి వస్తున్నాయని బ్రిటన్ హోం శాఖ తాజాగా వెల్లడించింది. పోస్ట్‌గ్రాడ్యుయేట్ రిసెర్చ్, ప్రభుత్వ స్కాలర్‌షిప్ కింద కోర్సులు చేస్తున్న విద్యార్థులకు మాత్రం కొత్త నిబంధనల నుంచి మినహాయింపు ఇచ్చారు.