Namaste NRI

బ్రిటన్ కీలక నిర్ణయం.. భారతీయులకు షాక్

కరోనా నేపథ్యంలో బ్రిటన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు అమలులో ఉన్న ట్రావెల్‌ రూల్స్‌ను రద్దు చేసింది. వాటి స్థానంలో కొన్ని సవరణలో కొత్త ప్రయాణ నిబంధనలను తీసుకొచ్చింది. అయితే ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా ఉన్నాయి. యూకే నిబంధనల ప్రకారం ఆఫ్రికా, దక్షిణ అమెరికా, యూఏఈ, టర్కీ, ఇండియా, థాయ్‌లాండ్‌, రష్యా తదితర దేశాల్లో ఎవరైనా ఒక వ్యక్తి రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్నా సరే సదరు వ్యక్తి యూకే ప్రభుత్వం దృష్టిలో వ్యాక్సిన్‌ తీసుకోనట్లే. అందువల్ల సదరు వ్యక్తి బ్రిటన్‌ వెళ్లిన తర్వాత తప్పని సరిగా అక్కడి నిబంధనల ప్రకారం క్వారెంటైన్‌లో ఉండాల్సి ఉంటుంది. ఈ నిబంధనలు భారత ప్రయాణికులకు ఇబ్బందికరంగా మారాయి.

                కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ దాదాపు ప్రపంచ దేశాలు గుర్తించి..  ఈ టీకాను తీసుకున్న ప్రయాణికులకు కొవిడ్‌ నిబంధనలను కూడా సరళతరం చేస్తున్నాయి. అయితే బ్రిటన్‌ మాత్రం ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. పూర్తి స్థాయిలో వ్యాక్సిన్‌ తీసుకున్న ప్రయాణికులను కూడా వ్యాక్సిన్‌ తీసుకోని వారిగా గుర్తిస్తూ ఇబ్బందులకు గురి చేస్తోంది. బ్రిటన్‌ తాజా ప్రయాణ నిబంధనలపై కాంగ్రెస్‌ పార్టీ నేత జైరామ్‌ రమేష్‌ స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌లోనే అభివృద్ధి చెందిన కొవిషీల్డ్‌ (ఆస్ట్రాజెనికా) టీకాను తీసుకున్న ప్రయాణికులను కూడా వ్యాక్సిన్‌ తీసుకొని వారి జాబితా చేర్చడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రిటన్‌ నిర్ణయంతో జాతి వివక్ష కోణం కనిపిస్తోందంటూ ధ్వజమెత్తారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events