Namaste NRI

బ్రిటన్‌ యువరాజు సతీమణి…కేట్‌ అదృశ్యం!

బ్రిటన్‌ యువరాజు విలియం సతీమణి, ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌  కేట్‌ మిడిల్టన్‌  గత కొన్ని రోజులుగా బాహ్య ప్రపంచానికి కనిపించడం లేదు. దీంతో ఆమె గురించి గత కొన్ని రోజులుగా వరుస కథనాలు వస్తున్న విషయం తెలిసిందే. అనారోగ్యం వల్ల కేట్‌ పొత్తికడుపు శస్త్రచికిత్స చేయించుకున్నారని, ప్రస్తుతం ఇంట్లో కోలుకుంటున్నారంటూ ప్రిన్స్‌ అండ్‌ ప్రిన్సెస్‌ ఆఫ్‌ వేల్స్‌ కార్యాలయం వెల్లడించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ ఆమె బయట ఎక్కడా కనిపించలేదు. అధికారిక కార్యక్రమాల్లో కూడా యువరాజు విలియం ఒక్కరే పాల్గొంటూ వస్తున్నారు. దీంతో కేట్‌ ఆరోగ్యంపై పలు వదంతులు మొదలయ్యాయి. శస్త్రచికిత్స అనంతరం కేట్‌ కోమాలోకి వెళ్లిపోయారంటూ ప్రచారం జరుగుతోంది.

Social Share Spread Message

Latest News