బ్రిటన్‌కు అక్రమంగా వలస వస్తున్న వారికి అడ్డుకట్ట వేసేందుకు ఆ దేశ ప్రధాని రిషి సునాక్ కొత్త బిల్లు తెచ్చారు. వారిపై కఠినంగా వ్యవహరిస్తామని, ఎట్టి పరిస్థితుల్లో వారిని శరణార్థులుగా పరిగణించమని ఆయన తెలిపారు. ఇల్లీగల్ మైగ్రేంట్ బిల్లుతో ఇక నుంచి శరణార్థుల అక్రమ వలసలకు అడ్డుకట్ట పడుతుందని వెల్లడించారు. మీరు కనుక మా దేశంలోకి అక్రమంగా ప్రవేశిస్తే ఇక నుంచి మిమ్మల్ని శరణార్థులుగా పరిగణించం, మీకు గతంలోలాగా బానిసత్వ రక్షణ ప్రయోజనాలు లభించవు. అలాగే మీరు నకిలీ మానవ హక్కుల దావాలు వేసుకోలేరు. అసలు మీరు ఇక్కడ ఉండలేరు అని పేర్కొన్నారు. ఒకవేళ ఎవరైనా అక్రమంగా ఉంటున్నట్లు గుర్తిస్తే, వారాల వ్యవధిలోనే వాళ్లను దేశం నుంచి పంపించి వేస్తారు. వాళ్ల స్వంత దేశానికి లేదా పొరుగునే ఉన్న రువాండా వంటి దేశాలకు పంపిస్తారు. అలాగే ఆస్ట్రేలియా, అమెరికాలాగే భవిష్యత్తులో వారికి బ్రిటన్‌లోకి ప్రవేశాన్ని నిషేధిస్తామని తెలిపారు.