బ్రిటన్ ప్రధాని లిజ్ ట్రస్కు పదవీ గండం పొంచి ఉన్నదని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నాంటున్నారు. ట్రస్ ప్రవేశపెట్టిన మినీ బడ్జెట్, ఆర్థిక విధానాలపై వ్యతిరేకతతో పాటు ఆర్థిక మంత్రి క్వాసీ క్యార్టెంగ్ను తొలగించిన నేపథ్యంలో ప్రధాని ట్రస్పై అధికార టోరీ పార్టీలోని కొంత మంది సీనియర్ ఎంపీలు తిరుబాటుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ప్రధానిగా ట్రస్ను తప్పించి, ఆ స్థానంలో రిషి సునాక్ లేదా పెన్నీ మోర్డాంట్ను కూర్చొబెట్టాలని పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. లిజ్ ట్రస్ను ప్రధానిగా ఎనుకొన్ని తప్పుడు నిర్ణయం తీసుకున్నామని ఎన్నికల్లో పాల్గొన్న 62 మంది శాతం ఓటర్లు పేర్కొన్నారని ఓ సర్వే వెల్లడిరచింది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)