బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టి చరిత్ర షృష్టించారు భారత సంతతికి చెందిన రిషి సునాక్. ప్రధాని పీఠం అధిరోహించిన వెంటనే ఆర్థిక వ్యవస్థను పరుగులు పెట్టించేందుకు చర్యలు మొదలు పెట్టారాయన. పార్టీ మీటింగ్స్, ఇతర పనులతో బిజీగా ఉండే రిషి సునాక్ లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్ ట్యూబ్ స్టేషన్లో కాగితపు పూలు అమ్మి ప్రయాణికులను ఆశ్చర్యపరిచారు. రాయల్ బ్రిటిష్ లెజియన్స్ వార్షిక లండన్ పోపీ డే అప్పీల్లో భాగంగా ఒక్కో పువ్వును అయిదు పౌండ్లు చొప్పున విక్రయించారు. బ్రిటిష్ సైన్యం, వైమానిక, నౌకా దళాలకు చెందిన వాలంటీర్లు ఇంటింటికి తిరిగి విరాళాలు సేకరించేందుకు బయలు దేరిన సమయంలో వారితో కలిసి ఈ పూల విక్రయ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు ప్రధాని సునాక్‌తో సెల్పీలు దిగారు. ఆఫీసులకు వెళుతున్న ప్రజలకు వెస్ట్‌మినిస్టర్ ట్యూబ్ స్టేషన్లో ప్రధాని రిషి సునాక్ ప్లేట్లో పూలు అమ్ముతూ కనిపించడంతో వారంతా షాక్‌కు గురయ్యారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/kansas-300x160.jpg)