బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్ లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కూచిపూడి నృత్య ప్రదర్శన చేసింది. ఇంటర్నేషనల్ కూచిపూడి డ్యాన్స్ ఫెస్టివల్ 2022 లో రిషి సునాక్ కూతురు అనౌష్క సునాక్, పలువురు చిన్నారులతో కలిసి భారతీయ సంప్రదాయ నృత్యమైన కూచిపూడి ప్రదర్శన ఇచ్చింది. ఎంతో చక్కగా నృత్యం చేసి అందరిని ఆకట్టుకుంది. ఇక ఈ డ్యాన్స్ ఫెస్టివల్‌లో 4 నుంచి 85 ఏళ్ల వయసు గల వందమంది వరకు కళాకారులు పాల్గొనడం జరిగింది. వారందరి ముందు ఎలాంటి భయం, బిడియం లేకుండా తొమ్మిదేళ్ల అనౌష్క చక్కటి ప్రదర్శన ఇవ్వడం విశేషం. ఈ కార్యక్రమానికి రిషి సునాక్ సతీమణి అక్షత, ఆయన తల్లిదండ్రులు హాజరయ్యారు.
