సంపూర్ణేష్‌బాబు, సంజోష్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్న చిత్రం సోదరా. మన్మోహన్ మేనంపల్లి దర్శకుడు. చంద్ర చంగలా నిర్మాత. ఈ చిత్రంలో ప్రాచీ బంసాల్, ఆరతిగుప్తా, బాబా భాస్కర్, గెటప్ శ్రీను తదితరులు నటిస్తు న్నారు. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌ను విడుదల చేశారు. అన్నదమ్ములిద్దరూ పెళ్లి కొడుకు గెటప్స్‌లో ఉన్న పోస్టర్ ఆకట్టుకునేలా ఉంది. అన్నదమ్ముల అనుబంధాన్ని ఆవిష్కరిస్తూ హాస్యప్రధానంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. చక్కటి వినోదంతో పాటు ఎమోషన్స్ ఉంటాయి. త్వరలో ఫస్ట్‌సింగిల్‌ను విడుదల చేయబోతున్నాం అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: జాన్ సంగీతం: సునీల్ కశ్యప్, నిర్మాణ సంస్థ: క్యాన్స్ ఎంటర్టైన్మెంట్స్, మాంక్ ఫిలిమ్స్. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకురానుంది.














