నితిన్ హీరోగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ తమ్ముడు. దిల్‌రాజు సమర్పణలో శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నది. వచ్చే ఏడాది మహాశివరాత్రి సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయనున్నట్టు మేకర్స్ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా ఓ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు.

కాగడాను చేత పట్టుకొని, భుజాన పాపను ఎత్తుకుని పరుగెడుతున్న నితిన్‌ని ఈ పోస్టర్‌లో చూడొచ్చు. ఆయనతోపాటు ఊరి జనం కూడా కాగడాలతో వెంట వస్తుండటం ఆసక్తిని రేకెత్తిస్తున్నది. నితిన్ న్యూ లుక్ సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని మేకర్స్ చెబుతున్నారు. లయ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్, నిర్మాణం: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్.
