కాంగ్రెస్ ప్రభుత్వం నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో గల్ఫ్ కార్మికుల కు మొండి చేయి చూపించి మోసం చేసిందని ఎన్నారై బీఆర్‌ఎస్ శాఖ అధ్యక్షులు రాధారపు సతీష్ కుమార్ విమర్శించారు. ఈ సందర్భంగా సతీష్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల కంటే ముందు గల్ఫ్ సంక్షేమానికి నిధులు, ప్రత్యేక ప్యాకేజీని కేటాయిస్తామని మేనిఫెస్టోలో చెప్పిన కాంగ్రెస్ పార్టీ బడ్జెట్‌లో మాత్రం నిధులు చేటాయించ లేద న్నారు. తెలంగాణ ఏర్పడక ముందు సరైనా ఉపాధి గల్ఫ్ దేశాలకు వలసలు పోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్, బీజేపీ పార్టీలేనని విమర్శించారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల సమయంలో గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం రూ.5 లక్షల బీమ సదు పాయం కల్పిస్తామని చెప్పారు. గల్ఫ్ కార్మికులను కంటికి రెప్పలా కాపాడుకునేది కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణకి ఒక్క రూపాయి ఇవ్వకపోడం సరికాదన్నారు. రానున్న రోజుల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెబుతారన్నారు.