Namaste NRI

ఇన్‌స్టాగ్రామ్‌లో బగ్ కనిపెట్టిన … రూ.35 లక్షల రివార్డు కొట్టి

ప్రపంచంలో ఎక్కువ మంది ఉపయోగించే సోషల్‌ మీడియా యాప్స్‌లో ఇన్‌స్టాగ్రాం ఒకటి. సెలెబ్రిటీల నుంచి సామాన్యుల వరకు ఇన్‌స్టాగ్రాం వాడుతూనే ఉంటారు. అలాంటి ఇన్‌స్టాలో బగ్స్‌ ఉంటే హ్యాకర్లు ఎన్ని ఖాతాలైన హాక్‌ చేసేందుకు వీలుంటుంది.  ఓ కుర్రాడు అనుకోకుండా అందులో బగ్‌ను గుర్తించాడు. దాని గురించి సంస్థకు సమాచారమందించి ఏకంగా 38 లక్షలు దక్కించుకున్నాడు. రాజస్థాన్‌లోని జైపుర్‌కు చెందిన నీరజ్‌ శర్మ అనే విద్యార్థి ఇన్‌స్టాగ్రామ్‌ను ఎక్కువగా వాడుతంటాడు. గత ఏడాది డిసెంబరులో రీల్స్‌ చూస్తున్న అతడికి ఆ సెగ్మెంట్‌లో బగ్‌ ఉందన్న అనుమానం వచ్చింది. ఆపై దాదాపు నెల రోజులు కష్టపడి దాన్ని నిర్ధారించుకున్నాడు. వినియోగదారులు తమ రీల్స్‌పై పెట్టే థంబ్‌నెయిల్‌ను పాస్‌వర్డ్‌ అవసరం లేకుండానే హ్యాకర్లు సులువుగా మార్చేసేందుకు ఆ బగ్‌ వీలు కల్పిస్తుందంటూ ఇన్‌స్టాగ్రామ్‌, దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌లకు సమాచారం అందించాడు. వాటి వినతి మేరకు డెమో కూడా పంపించాడు. బగ్‌ నిర్ధారించుకున్న ఫేస్‌బుక్‌ అతడికి రూ.35 లక్షల రికార్డు ప్రకటించింది.  మే నెలలోనే రివార్డును అందిస్తామన్న మూడు నెలలకు పైగా ఆలస్యం కావడంతో బోనస్‌గా రూ.3 లక్షలు కలిపి రూ.38 లక్షలు అతడికి అందజేసింది.

Social Share Spread Message

Latest News