నటుడు సోనూ సూద్ ఓ స్పోర్ట్ యాడ్‌లో నటిస్తున్నారు. లాన్‌డౌన్ వేళ ఎంతో మంది అభాగ్యులకి చేయూతనందించిన సోనూ సూద్ విశేష ప్రజాదరణ చూరగొన్న సంగతి తెలిసిందే. అలాంటి వ్యక్తికి యాడ్స్‌లో నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆయనతో ఓ ప్రకటనలో నటించేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ బాలికకు అవకాశం లభించింది.
మణికొండకు చెందిన బాలికకు నటుడు సోనూసూద్‌తో కలిసి నటించే అవకాశం లభించింది. సోనూసూద్ ఓ స్పోర్ట్స్ యాడ్ సిద్ధం చేస్తున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ ఆర్‌ఆర్‌సీ బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న కె.సమీక్షారెడ్డి (12)ని ఎంపిక చేసుకున్నారు. ఆమె బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా, కోచ్‌గా సోనూ ఆ యాడ్‌లో కనిపించనున్నారు. ఎల్బీస్టేడియంలో ఇందుకోసం షూటింగ్ నిర్వహించారు. ఈ యాడ్ ద్వారా వచ్చే డబ్బులో కొంత సోనూసూద్ చారిటీకి, మరికొంత ఆర్‌ఆర్‌సీలో శిక్షణ పొందే పేద క్రీడాకారులకు ఇవ్వనున్నట్లు బాలిక తండ్రి మధుసూదన్‌రెడ్డి తెలిపారు.