విమానయాన సంస్థ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ఇచ్చింది. రూ.9కే భారత్ నుంచి వియత్నాం వెళ్లేందుకు టికెట్‌ను అందిస్తోంది. వియత్నాంకు చెందిన ఎయిర్‌లైన్స్ ఈ బంపర్ ఆఫర్‌ను ప్రజలకు ముందుకు తీసుకొచ్చింది. కేవలం రూ.9కే (ఎయిర్ పోర్ట్ టాక్స్, సర్‌ఛార్జీలు అదనం) టికెట్ అందిస్తూ ఇండియా నుంచి వియత్నాంకు ప్రయాణించేందుకు వీలు కల్పించింది. కొద్ది రోజుల క్రితమే ఆఫర్ ప్రారంభం కాగా. రేపటితో దీనికి ఎండ్ కార్డు పడనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు ఆగస్ట్ 15 మార్చి 23, 2023 మధ్య ప్రయాణం చేయొచ్చని వెల్లడిరచింది. హైదరాబాద్, ముంబై, ఢల్లీి, అహ్మదాబాద్‌తో పాటు మరో 13 రూట్ల నుంచి వియత్నాంలోని హనోయ్, హో చిన్ మిన్ సిటీ, డా నాంగ్, ఫూ క్యోక్ నగరాలకు వెళ్లే వారికి ఈ రేటు వర్తించనుంది. ఈ ఆఫర్ పొందాలంటే కేవలం బుధ, గురు, శుక్రవారాల్లో మాత్రమే టికెట్‌ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)