ఇంద్రసేన, సంతోష్ రాజ్, నవీనా రెడ్డి, మెరిన్ ఫిలిప్, ప్రగ్యా నయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం బద్మాష్గాళ్లకి బంపర్ ఆఫర్. తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. సస్పెన్స్, డ్రామాతో ఉన్న ఈ ట్రైలర్ అద్యంతం ఆసక్తికరంగా ఉంటూ ఆకట్టుకుంటోంది. బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ ట్రైలర్ ఎలా ఉందో చూస్తే ఇవాళ.. రేపుతప్పు చేయకుండా బతకడం కష్టంరా.కానీ పక్కోడు చేసిన తప్పును వాడుకుని బతకడం ఈజీ అనుకుంటారు రాజు, రమేష్ అనే ఇద్దరు యువకులు. ఇదే ఆలోచనతో సులువుగా డబ్బు సంపాదిస్తూ జల్సా చేస్తుంటారు. ఈ క్రమంలో వాళ్లు కామెడీ, యాక్షన్స్ చేయాల్సి వస్తుంది. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ ఈ చిత్రంలో ప్రతి పదినిముషాలకు ఓ ట్విస్ట్ ఉంటుందని అన్నారు. ఈ థ్రిల్లర్ కథలో ఇమిడిపోయేలా పాటలు ఉంటాయి. అలాగే యాక్షన్‌తో పాటు మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. త్వరలోనే రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నాం అని అన్నారు. సరికొత్త డ్రామా చిత్రంగా మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుటుంది. చిత్రీకరణతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయ్యాయి. ఓ మంచి డేట్ చూసుకుని మా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం అని సమర్పకులు రఘవేంద్ర రెడ్డి తెలిపారు.
సస్పెన్స్ కామెడీ డ్రామ కథతో ఈ చిత్రాన్ని దర్శకుడు రవి చావలి తెరకెక్కిస్తున్నారు. ఫ్రెండ్స్ ఫిల్మ్ అకాడమీ, ప్లాట్ లైన్ ఎంటర్టైన్మెంట్స్, తిరుమల మీడియా బ్యానర్లపై నిర్మాతలు అతీంద్ర అవినాష్, అలవలపాటి శేఖర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. బద్మాష్ గాళ్లకి బంపర్ ఆఫర్ చిత్రానికి రాఘవేంద్రరెడ్డి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు