Namaste NRI

సందడిగా బేబీ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌

 ఆనంద్‌ దేవరకొండ, విరాజ్‌ అశ్విన్‌ హీరోలుగా, వైష్టవి చైతన్య హీరోయిన్‌గా సాయి రాజేష్‌ తెరకెక్కించిన చిత్రం బేబీ. ఎస్‌కేఎన్‌, దర్శకుడు మారుతి నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది.  ఈ చిత్రం టీజర్‌ని హైదరాబాద్‌లో విడుదల చేశారు.  దర్శకులు హరిష్‌ శంకర్‌, అనిల్‌ రావిపూడి, వెంకటేష్‌ మహా, వశిష్ట  అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సాయి రాజేష్‌ మాట్లాడుతూ  తమిళనాడులోని ఓ ప్రాంతంలో జరిగిన వాస్తవ ఘటన స్ఫూర్తితో తీసిన చిత్రమిది. ఇప్పటిదాకా నన్ను సాయి రాజేష్‌ అన్నారు. ఈ  సినిమా రిలీజయ్యాక బేబీ  దర్శకుడు అని పిలుస్తారు అన్నారు. మారుతి, నేను కలిసి ఈ మాస్‌ మూవీ మేకర్స్‌ సంస్థను స్థాపించాం. మా దృష్టిలో సినిమా అంటే అమ్మకం కాదు, నమ్మకం. అలాంటి నమ్మకంతోనే బీబీ నిర్మించాం అన్నారు ఎస్‌కేఎన్‌. నా కెరీర్‌ సవాలు విసిరిన, సంతృప్తి ఇచ్చిన సినిమా ఇది అన్నారు ఆనంద్‌ దేవరకొండ. ఈ సినిమాతో తనకి దర్శకుడిగా మరింత పేరొస్తుంది. ఆనంద్‌ విరాజ్‌ నటన ఆకట్టుకునేలా ఉంటుంది అన్నారు మారుతి. ఈ కార్యక్రమంలో చిత్ర బృందం పాల్గొంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress