ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోతున్నది. ఈ చిత్రంలోని నాటు నాటు పాట ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డ్‌ను సాధించి భారతీయ సినిమా కీర్తిప్రతిష్టల్ని ఇనుమడింపజేసింది. దర్శకుడు రాజమౌళి గ్లోబల్ డైరెక్టర్‌గా అవతరించారు. ఇటీవల ఆయన హాలీవుడ్ దిగ్దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో కలుసుకొని ఆర్ఆర్ఆర్ సినిమా విశేషాల్ని వివరించిన విషయం తెలిసిందే.
తాజాగా ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని ప్రముఖ హాలీవుడ్ దర్శకుడు జేమ్స్ కామెరూన్ వీక్షించారు. ఈ విషయాన్ని రాజమౌళి ట్విట్టర్ ద్వారా తెలియజేస్తూ ఆనందం వ్యక్తం చేశారు. గ్రేట్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ చిత్రాన్ని వీక్షించారు. ఆయనకు ఎంతగానో నచ్చింది. తన భార్య సుజీకి సినిమా గురించి వివరించి, ఆమెతో పాటు మరోసారి సినిమా చూశారు. ఈ విషయాన్ని ఇప్పటికీ నమ్మలేకపోతున్నా. పది నిమిషాల పాటు ఆయన మా సినిమాను విశ్లేషిస్తూ మాట్లాడటం అనిర్వచనీయమైన అనుభూతినిచ్చింది్ణ అని రాజమౌళి పేర్కొన్నారు. జేమ్స్ కామెరూన్ ఆర్ఆర్ఆర్ మ్యూజిక్‌పై ప్రశంసలు కురిపించారని సంగీత దర్శకుడు కీరవాణి పేర్కొన్నారు. ఆర్ఆర్ఆర్ సినిమా మ్యూజిక్ గురించి జేమ్స్ కామెరూన్ నాతో మాట్లాడారు. పాశ్చాత్య సంగీతంతో పోల్చితే ఆర్ఆర్ఆర్ ఎందుకు భిన్నమైనదో చక్కగా వివరించారు. ఆయన ప్రశంసలు నా ప్రతిభకు లభించిన గొప్ప గౌరవంగా భావిస్తున్నా అని చెప్పారు.














