Namaste NRI

అంతర్జాతీయ విద్యార్థులకు కెనడా షాక్‌

 కెనడాలోని వాంకోవర్‌లో ఉన్న ఓ ఫుడ్‌ బ్యాంక్‌ అంతర్జాతీయ విద్యార్థులకు షాక్‌ ఇచ్చింది. కళాశాలల్లో మొదటి సంవత్సరం చదువుతున్న విదేశీ విద్యార్థులకు ఉచిత ఆహారాన్ని అందించరాదని ది గ్రేటర్‌ వాంకోవర్‌ ఫుడ్‌ బ్యాంక్‌ నిర్ణయించింది. ఆహారం ధరలు, నిరుద్యోగం పెరిగిపోతుండటంతో, ఉచిత ఆహారం కోసం వస్తున్నవారి సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నదని తెలిపింది. దీంతో ఈ బ్యాంక్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా భారతీయ విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటారు. కెనడాలోని అంతర్జాతీయ విద్యార్థుల్లో అత్యధికులు భారతీయులేననే సంగతి తెలిసిందే. కెనడాలో జీవన వ్యయం రికార్డు స్థాయిలో పెరిగింది. దీంతో ప్రజలు ఉచిత ఆహారాన్ని అందించే ఫుడ్‌ బ్యాంకులపై ఆధారపడుతున్నారు. కెనడా ఫుడ్‌ బ్యాంక్స్‌ వార్షిక నివేదిక ప్రకారం, ఈ ఏడాది మార్చి నెలలో 20 లక్షల మందికిపైగా ఉచిత ఆహారం తీసుకున్నారు. 2019 మార్చిలో ఉచిత ఆహారం తీసుకున్నవారి సంఖ్యకు ఇది రెట్టింపు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events