కెనడా లో నిలిపివేసిన వీసా సేవలను పునరుద్ధరించాలన్న భారత్ నిర్ణయాన్ని కెనడా స్వాగతించింది. రెండు దేశాల మధ్య నెలకొన్న ఆందోళనకర పరిస్థితుల్లో ఈ నిర్ణయం సానుకూల సంకేతమని అభిప్రాయ పడింది. ఖలిస్థాన్ వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనుక భారత్ ప్రమేయం ఉందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ట్రూడో ఆరోపణలతో రెండు దేశాల మధ్య దౌత్యసంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో కెనడాలో వీసాల జారీ ప్రక్రియను నిలిపివేస్తూ భారత్ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే, వీసా సేవలను కొన్నింటిని తిరిగి పునరుద్ధరిస్తున్నట్లు భారత్ ప్రకటించింది. కెనడా ప్రభుత్వం ఇటీవల చేసిన ఏర్పాట్లు, భద్రతా చర్యలపై సమీక్షించిన అనంతరం ఇంచుమించు నెల రోజుల తర్వాత ఈ నెల 26 నుంచి ఎంట్రీ వీసా, బిజినెస్ వీసా, మెడికల్ వీసా, కాన్ఫరెన్స్ వీసా సర్వీసులను పునరుద్ధరిస్తున్నట్టు ఒట్టావాలోని భారత హై కమిషన్ కార్యాలయ ప్రతినిధి తెలిపారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)