ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూపై ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు అరెస్టు వారెంట్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇజ్రాయెల్ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్ గల్లెంట్, హమాస్ అధికారులపైనా ఈ వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్ ఐసీసీని ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.గాజాలో చేస్తున్న యుద్ధంలో యుద్ధనేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నెతన్యాహూ, గల్లెంట్‌పై, 2023 అక్టోబరులో ఇజ్రాయె ల్‌పై దాడికి పాల్పడినందున హమాస్ అధికారులపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.