Skip to main content

Namaste NRI

ఆ అరెస్టు వారెంట్‌ను రద్దు చేయండి

ఇజ్రాయెల్‌ ప్రధాన మంత్రి బెంజమిన్‌ నెతన్యాహూపై ఇంటర్నేషనల్‌ క్రిమినల్‌ కోర్టు  అరెస్టు వారెంట్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. ఆయనతో పాటు ఇజ్రాయెల్‌ మాజీ రక్షణ శాఖ మంత్రి యోవ్‌ గల్లెంట్‌, హమాస్‌ అధికారులపైనా ఈ వారెంట్లు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ఆ అరెస్టు వారెంట్‌ను రద్దు చేయాలని కోరుతూ ఇజ్రాయెల్‌ ఐసీసీని ఆశ్రయించింది. ఈ మేరకు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ విషయాన్ని ఇజ్రాయెల్‌ ప్రధాని కార్యాలయం ఓ ప్రకటనలో వెల్లడించింది.గాజాలో చేస్తున్న యుద్ధంలో యుద్ధనేరాలకు, మానవతా వ్యతిరేక నేరాలకు పాల్పడ్డారనే ఆరోపణలతో నెతన్యాహూ, గల్లెంట్‌పై, 2023 అక్టోబరులో ఇజ్రాయె ల్‌పై దాడికి పాల్పడినందున హమాస్‌ అధికారులపై ముగ్గురు సభ్యుల ధర్మాసనం అరెస్టు వారెంట్లు జారీ చేసింది.

Social Share Spread Message

Latest News