తమిళనాట ప్రేక్షకాదరణ పొందిన ధనుష్ చిత్రం కెప్టెన్ మిల్లర్. ఈ నెల 26న తెలుగులో విడుదల కానుంది. సత్యజ్యోతి ఫిలిమ్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రాన్ని ఏషియన్ సినిమాస్, సురేశ్ ప్రొడక్షన్స్ తెలుగులో విడుదల చేస్తున్నాయి. ఈ సందర్భంగా దర్శకుడు అరుణ్ మాథేశ్వరన్ చిత్ర విశేషాలను పాత్రికేయులతో పంచుకున్నారు. కెప్టెన్ మిల్లర్ గురించి పదేళ్ల క్రితం ఆలోచన వచ్చింది. బ్రిటిష్ ఆర్మీలో భారతీయ సైనికుడి పై సినిమా చేయాలన్న ఆలోచనతో స్క్రిప్ట్ పని మొదలుపెట్టాను. స్క్రిప్ట్ పూర్తి చేసిన తర్వాత కెప్టెన్ మిల్లర్ పాత్రకు ధనుష్ సరిగ్గా సరిపోతారని భావించాను.
ధనుష్ ఎలాంటి పాత్రైనా చేయగలడు. అతనితో పనిచేసిన అనుభవం అద్భుతం. ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను. నేర్చుకోవాల్సినవి ఇంకా ఉన్నాయి. కెప్టెన్ మిల్లర్ చాలా ఎమోషనల్ కథ. ఈ సినిమాలో యాక్షన్ 40 శాతమే ఉంది. మిగతా అంతా పాత్ర ప్రయాణం గురించిన ప్యూర్ డ్రామా. ఈ చిత్రంలో సమిష్టి తారాగణం ఉంది. ధనుష్, శివన్న (శివరాజ్‌కుమార్) మధ్య సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. మహిళా పాత్రలు ప్రేక్షకులను ఆశ్చర్యచకితులను చేయాలనుకునే నేను వెల్మతి పాత్ర కోసం ప్రియాంక అరుల్ మోహన్ కరెక్ట్ అనుకున్నాం. కెప్టెన్ మిల్లర్ స్వేచ్ఛ, ఆత్మగౌరవం గురించిన కథ. సినిమా ఇతివృత్తం చాలా యూనివర్సల్‌గా ఉంటుంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. ముఖ్యంగా తెలుగు ప్రేక్షకులకు అని చెప్పారు.