క్రెడాయ్ ఆధ్వర్యంలో హైదరాబాద్ హెచ్ఐసీసీలో ఏర్పాటు చేసిన ప్రాపర్టీ షోను తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్రగతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.
హైదరాబాద్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ పార్టీ ఫ్లీనరీ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి సీఎం కేసీఆర్ పూలమాల వేశారు.
విజయవాడ ఇంద్రకీలాద్రిపై వెలసిన దుర్గమాతను ప్రముఖ సినీ నటుడు రాంచరణ్, ఆచార్య సినిమా దర్శకుడు కొరటాల శివ దర్శించుకున్నారు.
మాదాపూర్ హెచ్ఐసీసీలో టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం నిర్వహించారు. ఫ్లీనరీ సభా వేదిక వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ జెండాను సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.
ఎన్నారై తెలుగుదేశం పార్టీ యూఎస్ఏ కో ఆర్డినేటర్‌గా నియమితులై తొలిసారిగా అమెరికాకు విచ్చేసిన జయరాం కోమటికి అమెరికా ఘన స్వాగతం లభించింది.
ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.
యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఫ్రాన్స్ అధ్యక్షుడిగా ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ మరోసారి ఎన్నికయ్యారు. మరో ఐదేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. ఈ ఎన్నికల్లో మేక్రాన్ స్పష్టమైన మెజారిటీతో విజయం సాధించారు.
గుజరాత్‌ను బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ సందర్శించారు. వడోదర సమీపంలోని బ్రిటన్‌కు చెందిన జేసీబీ ఫ్యాక్టరీకి సీఎం భూపేంద్ర పాటిల్‌తో కలిసి ఆయన వెళ్లారు. కొత్త ప్లాంట్‌ను ప్రారంభించిన సందర్భంగా బుల్డోజర్పైకి ఎక్కి సందడి చేశారు.
విశాఖపట్నంలోని రుషికొండ పెమ వెల్నెస్ రిసార్ట్‌లో హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌తో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మర్యాద పూర్వకంగా భేటీ అయ్యారు.