Skip to main content

Namaste NRI

ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, భారతి దంపతులు  రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నర్‌, సీఎం చర్చించారు.

శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. దేవ స్థాన కార్య నిర్వహణాధికారి ఇ.పెద్దిరాజు పట్టువస్త్రాలను సమర్పించారు.

విశాఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన ముగిసింది. యుద్ధనౌకల సమీక్ష నిమిత్తం విచ్చేసిన రాష్ట్రపతి విశాఖలో బస చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ నావల్ ఎయిర్ బస్ ఐఎన్ఎస్ డేగలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు.

మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట ఎయిర్ పోర్టులో హెలి టూరిజంను జెండా ఊపి ప్రారంభించారు.

సినీ నటుడు మోహన్ బాబును మంత్రి పేర్ని నాని మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు. మోహన్ బాబు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయి.