ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన ఎక్కడ ఉందో తెలుసా? మణిపూర్ లో అండి.. 141 మీటర్ల ఎత్తులో రైలు మార్గాన్ని నిర్మిస్తున్నారు.
బాలకృష్ణ, ప్రగ్య జైస్వాల్ జంటగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో నటించిన చిత్రం అఖండ. ఆ సినిమాలోని ఈ దృశ్యం చూస్తే మన కళ్లూ నిండిపోతాయి మరి.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మహావీర్ చక్ర అందుకున్న కర్నల్ బి. సంతోష్ బాబు భార్య సంతోషి, తల్లి మంజుల
మహేంద్రసింగ్ ధోనీ టీ తాగుతున్న సమయంలోఆయన భుజంపై మకావ్ పక్షి వాలి ఉంది. ‘మహి అండ్ హిజ్ హనీ’, చాయ్ డేట్స్ అని తెలుపుతూ సాక్షి పోస్టు పెట్టారు.
ప్రముఖ నటి పూనమ్‌కౌర్ మాజీమంత్రి, భాజపా ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను గురునానక్ జయంతిని పురస్కరించుకుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు ఏక్ ఓంకార్ సందేశంతో కూడిన చిత్రపటాన్ని బహూకరించారు.
ఏపీ శాసనమండలి ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన కొయ్యే మోషేన్ రాజును ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, మంత్రులు, సభ్యులు అభినందించారు
వరిధాన్యం కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసనగా ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ మహాధర్నా చేపట్టింది. రైతు మహాధర్నాలో టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ (ఆర్ఈసీ)సీఎండీ సంజయ్ మల్హోత్రా(ఐఏఎస్), పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ సీఎండీ డాక్టర్ ఆర్ ఎస్ ధిల్లాన్ కలిశారు. వీరు సీఎం వైఎస్ జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.