చండీగఢ్‌లో పంజాబ్ సీఎం భగవత్మాన్ సింగ్ పెళ్లి డాక్టర్ గురుప్రీత్ కౌర్‌తో ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, ఆప్ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దా హాజరయ్యారు.
ఢిల్లీలోని తెలంగాణ భవన్లో జరిగిన బోనాల వేడుకలకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి హాజరై, ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నాగాలాండ్ సివిల్ సర్వీసెస్ అధికారుల బృందం సిద్దిపేట జిల్లాలోని కోమటి బండలో గల మిషన్ భగీరథ ప్లాంటును సందర్శిoచారు.
జీవన సాఫల్య పురస్కార ప్రదాన మహోత్సవంలో ప్రముఖ నేపధ్య గాయని పీ.సుశీలను వాసవి సత్ర సముదాయం అధ్యక్షులు దేవకి వెంకటేశ్వర్లు దంపతులు శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.
ఆటా 17వ మహాసభల్లో పాల్గొనేందుకు ఎమ్మెల్సీ కవిత అమెరికా చేరుకున్నారు. వాషింగ్టన్ విమానాశ్రయంలో ఎమ్మెల్సీ కవితకు ఘన స్వాగతం లభించింది.
రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేశారు. విపక్ష పార్టీల నేతలతో కలిసి యశ్వంత్ సిన్హా.. పార్లమెంట్ కార్యదర్శికి నామినేషన్ పత్రాలు అందించారు.