భారత ఆర్మీ చీఫ్‌గా లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే నియమితులయ్యారు. జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె స్థానాన్ని ఆయన భర్తీ చేయనున్నారు. కాగా, ఆర్మీలో అత్యున్నత పదవిని తొలిసారి ఒక ఇంజినీర్ చేపట్టనుండటం విశేషం.
వైఎస్ఆర్ జిల్లాలోని ఒంటిమిట్ట కోదండరామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రామయ్య రథోత్సవాన్ని నిర్వహించారు. భక్తులు పెద్దఎత్తున హాజరై స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా తిరుమల శ్రీవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ అధికారులు సీజేకు లాంఛనంగా స్వాగతం పలికారు. దర్శనానంతరం సీజేకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొత్త మంత్రివర్గం కొలువు తీరింది. 25మంది కొత్త మంత్రుల చేత రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాజ్యసభ సభ్యులుగా పదవీకాలం పూర్తి చేసుకున్న ఎంపీలు విజయసాయిరెడ్డి, సురేష్ ప్రభు, టీజీ వెంకటేశ్, సుజనా చౌదరి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని కలిశారు. ఉపరాష్ట్రపతి వారిసేవలను అభినందించారు
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం ఈ – సిటీ లొ విప్రో సంస్థ నూతన పరిశ్రమను విప్రో సంస్థ అజీమ్ ప్రేమ్ తో కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు
నెదర్లాండ్ పర్యటనలో భాగంగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ఘనస్వాగతం లభించింది. ఆమ్స్టర్డామ్లోని డామ్ స్క్వేర్ వద్ద సైనిక వందనం స్వీకరించారు రాష్ట్రపతి కోవింద్. రాజు అలగ్జాండర్, రాణి మాగ్జిమా రాష్ట్రపతి దంపతులకు స్వాగతం పలికారు.
Telangana American Telugu Association Mega Convention 2022- TTA-New York Team Fundraising kickoff event
ఉగాది పర్వదినాన తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. భర్త సౌందరరాజన్‌తో కలిసి స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. గవర్నర్ దంపతులకు ఆలయ అర్చకులు ప్రత్యేక ఆశీర్వచనాలు అందజేశారు.
ప్రగతి భవన్లో శుభకృత నామ సంవత్సర ఉగాది వేడుకలు ఘనంగా జరిగాయి. జనహితలో ప్రభుత్వ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొన్నారు. అనంతరం శుభకృత్ నామ సంవత్సర ఉగాది పంచాంగాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు.