RRR చిత్ర ప్రమోషన్ లో భాగంగా చిత్ర యూనిట్ దేశంలోని వివిధ ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు దర్శకుడు రాజమౌళి, జూ ఎన్టీఆర్, రామ్ చరణ్.ఇప్పుడు అమృతసర్ లోనీ స్వర్ణదేవాలయం సందర్శించారు.
ఆస్ట్రేలియా నుంచి తిరిగి తెప్పించిన 29 భారతీయ కళాఖండాల్ని ప్రధాని మోదీ పరిశీలించారు. వీటిలో శివుడు, విష్ణు, జైన సంప్రదాయానికి సంబంధించిన పురాతన విగ్రహాలున్నాయి. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తర్‌ప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలకు చెందివని ఉన్నాయి.
తెలంగాణ రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స్వీకరించారు
హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు నిర్వహించారు. పంజాబ్ గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, హరియాణా, పంజాబ్ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్ కట్టర్, భగవంత్‌మాన్, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ(మార్చి 13) నిజామాబాద్‌లోని భూమారెడ్డి కన్వెన్షన్ సెంటర్లో 18 వేల నాణేలతో 12 అడుగుల చిత్రం రూపొందించారు. ఆ చిత్రంపై హ్యాపీ బర్త్‌డే కవితక్క అని రాశారు.
యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామీ బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి తిరు కల్యాణానికి ప్రభుత్వం తరుపున పట్టు వస్త్రాలు సమర్పిస్తున్న మంత్రి ఇంద్ర కరణ్ రెడ్డి.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు రాష్ట్రాల్లో అఖండ విజయం సాధించిన అనంతరం స్వరాష్ట్రం గుజరాత్ లో పర్యటిస్తున్న PM మోడీ కి ఘన స్వాగతం పలుకుతున్న ఆ రాష్ట్ర ప్రజలు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూ.2,56,958.51 కోట్లతో ప్రవేశపెట్టారు. రెవెన్యూ వ్యయం రూ.1.89 లక్షల కోట్లు కాగా, క్యాపిటల్ వ్యయం రూ.29,728 కోట్లు.
అగ్ర కథానాయకుడు చిరంజీవిని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఏప్రిల్‌లో నిర్వహించే అఖిల భారత సాంస్కృతిక కార్యక్రమాలకు రావాల్సిందిగా ఆహ్వానించారు.
అనంతపురం జిల్లాలోని పాలసముద్రం గ్రామంలో నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్, పరోక్ష పన్నులు, నార్కోటిక్స్ అకాడమీ (నాసిన్) భూమి పూజలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు.
విశాఖలో నిర్వహించిన మిలాన్ – 2022 ముగిసింది. ఎనిమిది రోజల పాటు ప్రజలను అలరించిన నేవీ.. స్వీట్ ప్రజలకు మెమోరీస్ అందించింది. విశాఖ తీరం మిలాన్-2022 నౌకాదళ విన్యాసాలతో నేవీ సిబ్బంది హోరెత్తించారు.
ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను వేగంగా తరలిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ విమానాశ్రయంలో కిషన్ రెడ్డి స్వాగతం పలికారు.
శ్రీశైలంలో మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామి, అమ్మవార్లకు రథోత్సవం నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు.