Namaste NRI

న్యూఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు. గంటపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం, రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు అంశాలపై చొరవ చూపాలని కోరుతూ సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రధానికి వినతిపత్రం అందించారు.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ దవాఖానాల్లో అన్ని రకాల మౌలిక వసతులను పటిష్ట పరచాలని, ప్రస్తుతం ఉన్న బెడ్స్, ఆక్సిజన్ బెడ్స్, మందులు, పరీక్షా కిట్లను అవసరం మేరకు సమకూర్చుకోవాలని మంత్రి శ్రీ హరీశ్ రావును, వైద్యాధికారులను సీఎం శ్రీ కేసీఆర్ ఆదేశించారు. ప్రజారోగ్య పరిరక్షణే ధ్యేయంగా హైదరాబాద్ లో విజయవంతంగా అమలవుతూ సామాన్యులకు నాణ్యమైన వైద్య సేవలను అందిస్తున్న బస్తీ దవాఖానాలను రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నగరపాలికల్లో అవసరం మేరకు విస్తరించాలని, జీహెచ్ఎంసీ పరిధిలో కూడా బస్తీ దవాఖానాల సంఖ్యను మరింతగా పెంచాలని సీఎం ఆదేశించారు.

ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్ రెండోరోజు ఢిల్లీ పర్యటనలో కేంద్రమంత్రి శ్రీ నితిన్ గడ్కరీతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో పలు జాతీయ రహదారులు మంజూరు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. విశాఖ పోర్ట్ నుండి భోగాపురానికి 6 లైన్లతో జాతీయ రహదారి ఎంతో ప్రయోజనకరం అని, దాని నిర్మాణానికి చొరవ చూపాలని సీఎం శ్రీ వైయస్ జగన్ కేంద్రమంత్రిని కోరారు. విజయవాడ తూర్పు బైపాస్, NH-216కి సంబంధించి బాపట్లలో 4 లైన్ల రోడ్డు విస్తరణ కోసం సీఎం విజ్ఞప్తి చేశారు.

ప్రముఖ తెలుగు సినీ నటుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే శ్రీ కోట శ్రీనివాసరావు గారిని హైదరాబాద్ లోని వారి నివాసంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి కలవడం జరిగింది. 40 ఏళ్లుగా చిత్ర పరిశ్రమలో వారు ఎనలేని కృషి చేసారు.వారు ఆరోగ్యంగా, క్షేమంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నాను.

ప్రధాని నరేంద్ర మోదీతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి భేటీ అయ్యారు. ప్రధాని నివాసంలో జరిగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలను, పెండిరగ్‌ సమస్యలను ప్రధానికి ముఖ్యమంత్రి వైఎస్‌ నివేదించారు. ఈ మేరకు విజ్ఞాపన పత్రం కూడా ముఖ్యమంత్రి అందించారు.

అల్లూరి సీతారామరాజు 125వ జయంతి సందర్భంగా.. అల్లూరి సీతారామరాజు సినిమా తీసిన సూపర్‌ స్టార్‌ కృష్ణకు సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి, సినీనటుడు మోహన్‌ బాబు, మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ తదిరులు పాల్గొన్నారు.

నూతన సంవత్సరం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని తిరుమల తిరుపతి దేవస్థానం, శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునస్వామి దేవస్థానం పూజారులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ప్రధానిని శేష వస్త్రంతో సన్మానించారు.

హీరో సాయిధరమ్ తేజ్ ను కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి పరామర్శించారు. హైదరాబాద్ లోని సాయిధరమ్ తేజ్ నివాసానికి వెళ్లి అతని ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు మంత్రి కిషన్ రెడ్డి. అనంతరం రోడ్డు ప్రమాదం, తదితర విషయాలపై చర్చించుకున్నట్లు సమాచారం.

అంతర్వేది పల్లిపాలెం మినీ ఫిషింగ్ హార్బర్లో నెమలి కోనాం చేప పర్యాటకులను ఆకర్షించింది. 30 కిలోల బరువు, ఎనిమిది అడుగుల పొడవు ఉండే ఈ మత్స్యం వెన్నుపై నెమలికి ఉండే పించం వలే ఉంది. ఇది అంతర్వేది తీరంలో కాకినాడ మత్స్యకారుల వలకు చిక్కింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ను కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఢిల్లీలో మర్యాదపూర్వకంగా కలిశారు. స్వాతంత్య్ర అమృత మహోత్సవాలను పురస్కరించుకుని దేశవ్యాప్తంగా తమ శాఖ తరపున చేపడుతున్న కార్యక్రమాలను ఈ సందర్భంగా రాష్ట్రపతికి కిషన్ రెడ్డి వివరించారు.