Skip to main content

Namaste NRI

ఎన్డీయే ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా జ‌గ‌దీప్ ధ‌న్‌ఖ‌డ్ పార్ల‌మెంట్‌లో నామినేష‌న్ దాఖ‌లు చేశారు.ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌ధాని మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్‌, నితిన్ గ‌డ్క‌రీ హాజ‌ర‌య్యారు.

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో విపక్షాల ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్‌ సీనియర్‌ నేత మార్గరెట్‌ అల్వా(80) ఖరారు చేశారు. ఈ మేరకు ఆమె పేరును ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ ప్రకటించారు.

 ఉడిపి శ్రీ పుత్తిగె మఠం పీఠాధిపతి శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ సుగుణేంద్ర తీర్థ స్వామీజీకి ఆలయ అధికారులు, పూజారులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.

శ్రీలంక ప్రధానమంత్రి రణిల్‌ విక్రమ సింఘే (73) దేశ తాత్కాలిక అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు.  గొటబయా రాజపక్స స్థానంలో కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునే వరకు విక్రమసింఘే ఈ పదవిలో కొనసాగుతారు.