Namaste NRI

నల్గొండ టౌన్‌లో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ముస్లింల‌కు ఏర్పాటు చేసిన‌ ఇఫ్తార్‌లో శాస‌న‌మండ‌లి చైర్మ‌న్ గుత్తా సుఖేంద‌ర్‌రెడ్డి, ఎమ్మెల్యే భూపాల్‌రెడ్డితో క‌లిసి మంత్రి జ‌గ‌దీశ్‌రెడ్డి పాల్గొన్నారు.

నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం మోర్తాడ్ మండల కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం అధ్వర్యంలో ముస్లింల‌కు ఏర్పాటు చేసిన ఇఫ్తార్‌లో ఆర్ అండ్ బీ శాఖ మంత్రి వేముల ప్ర‌శాంత్‌రెడ్డి పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్​ క్రీడలు, యువజన సర్వీసులు, టూరిజం శాఖ మంత్రి ఆర్​కే రోజా మెగాస్టార్ చిరంజీవితో భేటీ అయ్యారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రోజాను చిరంజీవి అభినందించారు. ఈ సందర్భంగా రోజాకు చిరు శాలువా కప్పి సన్మానించారు.

 ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌ర్యాట‌క, సాంస్కృతిక శాఖ మంత్రి ఆర్కే రోజా ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో ముఖ్య‌మంత్రి కేసీఆర్‌తో స‌మావేశ‌మ‌య్యారు. ఈ సంద‌ర్భంగా మంత్రి రోజాకు సీఎం కేసీఆర్ శుభాకాంక్ష‌లు తెలిపారు.

యాదాద్రి సన్నిధిలో సీఎం కేసీఆర్‌ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రధానాలయంలో స్వామి వారిని కేసీఆర్‌ దంపతులు దర్శించుకున్నారు. అనంతరం కేసీఆర్‌ దంపతులను అర్చక బృందం ఆశీర్వదించి, తీర్థ ప్రసాదాలు అందజేశారు.