Skip to main content

Namaste NRI

శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది పర్వదినాన తెలుగు రాష్ట్రాల్లో సందడి నెలకొంది. ఏపీ సీఎం క్యాంపు కార్యాలయంలో ఉగాది వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దంపతులు ఈ వేడుకలకు హాజరయ్యారు.

హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో జాతీయ సంస్కృతిక మహోత్సవాలను ప్రారంభించారు. కార్యక్రమానికి హాజరైన గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌,  కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తెలుగు స్వాతంత్ర్య సమరయోధుల ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు.

భారత పర్యటనలో ఉన్న రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లవ్రోస్‌ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్‌తో భేటీ అయ్యారు. ఇందులో భాగంగా భారత్‌, రష్యాల పరస్పర సహకారంపై చర్చించారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్థితుల గురించి మాట్లాడుకున్నారు.