Skip to main content

Namaste NRI

ఆస్ట్రేలియా నుంచి తిరిగి తెప్పించిన 29 భారతీయ కళాఖండాల్ని ప్రధాని మోదీ పరిశీలించారు. వీటిలో శివుడు, విష్ణు, జైన సంప్రదాయానికి సంబంధించిన పురాతన విగ్రహాలున్నాయి. రాజస్థాన్‌, గుజరాత్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, తమిళనాడు, తెలంగాణ, పశ్చిమబెంగాల్‌ రాష్ట్రాలకు చెందివని ఉన్నాయి.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన దర్శనం మొగిలయ్య పద్మశ్రీ అవార్డును అందుకున్నారు. రాష్ట్రపతి భవన్‌లో జరిగిన అవార్డుల ప్రదాన కార్యక్రమంలో రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ నుంచి మొగిలయ్య పద్మశ్రీ స్వీకరించారు

హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ చండీగఢ్‌లోని రాజ్‌భవన్‌లో హోలీ సంబరాలు నిర్వహించారు. పంజాబ్‌ గవర్నర్‌ బన్వరిలాల్‌ పురోహిత్‌, హరియాణా, పంజాబ్‌ ముఖ్యమంత్రులు మనోహర్‌లాల్‌ కట్టర్‌, భగవంత్‌మాన్‌, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

ఎమ్మెల్సీ కవితకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ(మార్చి 13) నిజామాబాద్‌లోని భూమారెడ్డి కన్వెన్షన్‌ సెంటర్‌లో 18 వేల నాణేలతో 12 అడుగుల చిత్రం రూపొందించారు. ఆ చిత్రంపై హ్యాపీ బర్త్‌డే కవితక్క అని రాశారు.

విశాఖలో నిర్వహించిన మిలాన్ – 2022 ముగిసింది. ఎనిమిది రోజల పాటు ప్రజలను అలరించిన నేవీ.. స్వీట్ ప్రజలకు మెమోరీస్ అందించింది. విశాఖ తీరం మిలాన్‌-2022 నౌకాదళ విన్యాసాలతో నేవీ సిబ్బంది హోరెత్తించారు.

ఆపరేషన్ గంగ ద్వారా ఉక్రెయిన్ నుంచి భారత విద్యార్థులను వేగంగా తరలిస్తున్నామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఉక్రెయిన్ నుంచి వచ్చిన విద్యార్థులకు ఢిల్లీ విమానాశ్రయంలో కిషన్ రెడ్డి స్వాగతం పలికారు.