తెలంగాణ రాష్ట్ర మంత్రి హరీశ్‌రావు ఏడుపాయల వన దుర్గా మాతను దర్శించుకున్నారు. మహాశివరాత్రి జాతర ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున అమ్మవారికి ఆయన పట్టువస్త్రాలు సమర్పించారు.
మహా శివరాత్రి జాతరకు వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయం సిద్ధమైంది. శివరాత్రి సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ దంపతులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, భారతి దంపతులు రాజ్‌భవన్‌లో మర్యాద పూర్వకంగా కలిశారు. సమకాలీన రాజకీయ అంశాలపై గవర్నర్, సీఎం చర్చించారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీకాళహస్తి దేవస్థానం వారు శ్రీశైల భ్రమరాంబిక, మల్లికార్జున స్వామి అమ్మవార్లకు పట్టువస్త్రాలను సమర్పించారు. దేవ స్థాన కార్య నిర్వహణాధికారి ఇ.పెద్దిరాజు పట్టువస్త్రాలను సమర్పించారు.
విశాఖలో రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన ముగిసింది. యుద్ధనౌకల సమీక్ష నిమిత్తం విచ్చేసిన రాష్ట్రపతి విశాఖలో బస చేశారు. గవర్నర్ బిశ్వభూషణ్ నావల్ ఎయిర్ బస్ ఐఎన్ఎస్ డేగలో ఆయన్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి వీడ్కోలు పలికారు.
తెలంగాణ కుంభమేళా ప్రసిద్ధి చెందిన మేడారం మహాజాతర ముగిసింది. భక్తుల నుంచి పూజలందుకు గిరిజన దేవతలు వనప్రవేశం చేశారు. వనప్రవేశం ఘట్టంతో మేడారం మహాజాతర ముగిసింది.
మేడారం జాతరలో సమ్మక్క సారలమ్మలకు పూజలు చేసిన కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి, హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్
రాజన్నసిరిసిల్ల జిల్లా ఓబులాపురంలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ జాతరలో వన దేవతలకు బంగారం బెల్లం సమర్పించి మొక్కు తీర్చుకున్న మంత్రి కేటీఆర్
మేడారం జాతరకు హెలికాఫ్టర్ సర్వీసులు ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ బేగంపేట ఎయిర్ పోర్టులో హెలి టూరిజంను జెండా ఊపి ప్రారంభించారు.
సినీనటుడు, వైసీపీ నేత అలీ కుటుంబ సమేతంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎంతో భేటీ అయ్యారు.
సినీ నటుడు మోహన్ బాబును మంత్రి పేర్ని నాని మర్యాద పూర్వకంగా హైదరాబాద్ లో కలిశారు. మోహన్ బాబు ఆహ్వానం మేరకు ఇంటికి వెళ్లారు. ఈ సందర్భంగా సినీ పరిశ్రమ సమస్యలు, ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ప్రస్తావనకు వచ్చాయి.
గుజరాత్ లోని నర్మదా వ్యాలీలో నెలకొల్పిన భారత తొలి ఉప ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సందర్శించారు.