Skip to main content

Namaste NRI

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తో సినీ ప్రముఖులు భేటీ. సినీ ఇండస్ట్రీ సమస్యలపై ప్రధానంగా చర్చ జరిగింది. చిరంజీవి, ప్రభాస్, మహేశ్ బాబు, రాజమౌళి, కొరటాల శివ, పోసాని కృష్ణమురళి, ఆర్ నారాయణ మూర్తి, నిరంజన్ రెడ్డి, అలీతో సమావేశం అయ్యారు.

మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ముచ్చింతల్లోని సమతా మూర్తి విగ్రహాన్ని కుటుంబసమేతంగా దర్శనం చేసుకున్నారు. సమారోహంలో అర్చకులు సిఎం శివరాజ్ సింగ్ కు పూర్ణకుంభ స్వాగతం పలికారు.

భారత గాన కోకిల లతా మంగేష్కర్‌కు సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ తనదైన శైలిలో నివాళి అర్పించారు. ఒడిశాకు చెందిన ప్రసిద్ధ కళాకారుడైన ఆయన పూరీలోని సముద్ర తీరంలో లతా మంగేష్కర్‌ సైకత శిల్పాన్ని రూపొందించారు.

ముచ్చింతల్ లోని శ్రీరామనుజం సహస్రాబ్ది వేడుకల్లో సినీ నటుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. రామానుజాచార్య సమతా మూర్తి విగ్రహాన్ని దర్శించుకున్నారు. అనంతరం చిన జీయర్ స్వామి ఆశీస్సులు తీసుకున్నారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టు లో ప్రధాని మోదీకి గవర్నర్ తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి స్వాగతం పలికారు.

రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌లోని శ్రీరామానుజ స్వామివారి సహస్రాబద్ది సమరోహ కార్యక్రమం అంగరంగ వైభవంగా మొదలైంది. చినజీయర్‌ ఆశ్రమం నుంచి స్వామి వారి శోభయాత్ర అత్యంత వైభవంగా నిర్వహించారు.

పద్మశ్రీ అవార్డుకు ఎంపికైన డోలు వాద్యకారుడు రామ చంద్రయ్యకు సీఎం కేసీఆర్‌ భారీ సాయం చేశారు. కోటీ రూపాయల నజరానా ప్రకటించారు. కొత్తగూడెంలో ఇంటి స్థలం, ఇంటి నిర్మాణం కోసం కోటీ రూపాయలు ప్రకటించారు.

కిన్నెర మెట్ల కళాకారుడు దర్శనం మొగిలయ్యకు కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. మొగిలయ్య సీఎం కేసీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్యను సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు.