నిజామాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికైన కల్వకుంట్ల కవిత ఎమ్మెల్సీగా ప్రమాణస్వీకారం చేశారు. మండలి చైర్మన్ చాంబర్లో ప్రొటెం చైర్మన్ జాఫ్రీ కవితతో ప్రమాణ స్వీకారం చేయించారు.
తణుకుకు చెందిన తుమ్మలపల్లి సుబ్రహ్మణ్యం అన్నపూర్ణ దంపతుల కుమారుడు సాయికృష్ణకు.. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరానికి చెందిన అత్యం వెంకటేశ్వరావు మాదవిల కుమార్తె కుందవికి వివాహం నిశ్చయమైంది. కాబోయే నూతన వధూవరులకు 365 రకాల వంటలను రుచి చూపించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లా చెముడు లంకకు చెందిన ప్రత్తి సత్యనారాయణ కొడుకులు, కోడళ్లు, కుమార్తెలు, వారి పిల్లలు, బంధువులు మొత్తం 30 మందిని ఒకే చోట కూర్చోబెట్టి అందరికీ ఒకే సారి అరిటాకుల్లో భోజనం పెట్టారు.
సినీ హీరో బాలకృష్ణ చీరాల సుముద్ర తీరంలో సందడి చేసారు. ఇసుక ప్రాంతాలలోనూ, సముద్ర తీర ప్రాంతాలలో ప్రయాణించే ప్రత్యేక వాహనంలో బాలయ్య దంపతులు సరదాగా ఓపెన్ టాప్ జీప్‌లో షికారు చేశారు.
తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దర్శించుకున్నారు. విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో కలసి శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీ వేంకటేశ్వర అన్నప్రసాదం ట్రస్టుకు భారత్ బయోటెక్ సంస్థ చైర్మన్ కృష్ణ ఎల్ల, జేఎండీ సుచిత్రా ఎల్ల దంపతులు రూ.2 కోట్లు విరాళంగా అందజేశారు.
తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమలలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి భేటీ అయ్యారు. సినిమా టికెట్ల ధరలు, ఇండస్ట్రీ సమస్యలపై చర్చించడానికే ముఖ్యమంత్రి జగన్‌తో చిరంజీవి సమావేశం అయ్యారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతీ స్వామి ఆహ్వానించారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు పీఠంలో వార్షిక మహోత్సవాలు జరుగుతాయని, తప్పక హాజరు కావాలని కోరారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌తో ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ప్రగతి భవన్లో సమావేశమయ్యారు. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, థర్డ్ ఫ్రంట్‌పై సీఎం కేసీఆర్‌తో తేజస్వి మంతనాలు సాగించారు.
తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావుతో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ నందమూరి బాలకృష్ణ భేటీ అయ్యారు. సంస్థ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మంత్రి సానుకూలంగా స్పందించారని ఆసుపత్రి వర్గాలు తెలిపాయి.
సోనూసూద్ సోదరి మాళవిక సూద్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పంజాబ్ రాష్ట్ర సీఎం చరణ్‌జీత్ సింగ్ చన్నీ, సిద్ధూ సమక్షంలో మాళవిక కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.
Telangana American Telugu Association MOU With Sunshine Hospital’s. TTA Health cards will be a great help to get right care at right time with access to multispeciality hospitals and specialist doctors.
ఇటీవల మోటార్ వాహన ప్రమాదంలో గాయపడిన హీరో సాయి ధరమ్ తేజ్ ని కలసి ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయన అతి త్వరలో కోలుకోవాలని ఆకాంక్షించారు.
న్యూఢిల్లీలో ప్రధాని శ్రీ నరేంద్ర మోడీతో ఆయన నివాసంలో సీఎం శ్రీ వైయస్ జగన్ భేటీ అయ్యారు. గంటపాటు సాగిన భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలను, పెండింగ్ సమస్యలను ముఖ్యమంత్రి ప్రధానికి వివరించారు. పోలవరం సవరించిన అంచనా వ్యయం, రెవెన్యూ లోటు భర్తీ, తెలంగాణ నుండి రావాల్సిన విద్యుత్ బకాయిలు, కడప స్టీల్ ప్లాంట్ కు గనుల కేటాయింపు అంశాలపై చొరవ చూపాలని కోరుతూ సీఎం శ్రీ వైయస్ జగన్ ప్రధానికి వినతిపత్రం అందించారు.