యూఏఈలోని దుబాయిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. క్రైస్తవ సంఘాల కలయికతో బ్రదర్ సామ్యూల్ రత్నం నీలా ఆధ్వర్యంలో డైరా క్రీక్ దౌ క్రూజ్‌లో ఈ సంబరాలు చేసుకున్నారు. క్వైర్ మ్యూజిక్ సిస్టమ్‌తో కలిపి అంతా ప్రార్థనలు చేస్తూ పాటలతో అలరించారు. బ్రదర్ అరవింద్ బృందం వారు క్రిస్మస్ కలర్స్‌తో చేసిన గాత్ర కచేరి అందరినీ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా 200లకు పైగా క్రైస్తవ కుటుంబాలు తమ పిల్లలతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశాయి. ఈ కార్యక్రమంలో దుబాయిలోని వివిధ సంఘాలకు చెందిన పాస్టర్లు, సంఘ పెద్దలతో పాటు సామాజిక కార్యకర్తలు సిస్టర్ ఎస్తర్, పాస్టర్ ఫ్రాన్సిస్, డాక్టర్ ముక్కు తులసీ కుమార్, రావి కిరణ్ కోడి, కంబాల మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/tantex-300x160.jpg)