Namaste NRI

నేటి నుంచి టోక్యో ఒలింపిక్స్ సంబరాలు

గత ఏడాది జరగాల్సిన ఒలింపిక్స్‌ 2021కు వాయిదాపడగా.. కరోనా నేపథ్యంలో టోక్యోలోని ప్రధాన స్టేడియంలో జులై 23  జరిగే ప్రారంభోత్స వేడుకలతో 2020 ఒలింపిక్స్‌ ప్రారంభమై, ఆగస్టు 8న జరిగే ముగింపు ఉత్సవాలతో ముగియనున్నాయి. కరోనా నేపథ్యంలో అతికొద్దిమంది విఐపీలు, నిర్వాహకులు, స్పాన్సర్ల మధ్యే ఒలింపిక్స్‌ వేడుకలు ఆరంభం కానున్నాయి. ఇక ప్రతి దేశం నుంచి కేవలం ఆరుగురు మాత్రమే హాజరయ్యేందుకు ఆర్గనైజింగ్‌ కమిటీ అనుమతిచ్చింది. భారత్‌ నుంచి ఈసారి అత్యధికంగా 127 మంది అథ్లెట్లు ఒలింపిక్స్‌కు అర్హత సాధించినా కేవలం 26 మందికి మాత్రమే ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు అనుమతి లభించింది. వీరిలో 20 మంది అథ్లైట్లు, ఆరుగురు అధికారులు ఉండనున్నారు.

                 భారత బృందానికి ఫ్లాగ్‌ బేరర్లుగా సీనియర్‌ మహిళా బాక్సర్‌ మేరీకోమ్‌, హాకీజట్టు కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ త్రివర్ణ పతాకాన్ని తమ భుజాలపై కెప్టెన్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌ త్రివర్ణ పతకాన్ని తమ భుజాలపై మోయనున్నారు. రెండు రోజుల ముందునుంచే సాఫ్ట్‌బాల్‌, ఫుట్‌బాల్‌ పోటీలు ప్రారంభం కాగా, జులై 23న జరిగే వేడుకలతో అధికారికంగా అన్ని క్రీడలు మొదలుకానున్నాయి. ఒలింపిక్స్‌లో తొలి పోటీని భారత మహిళా అర్చర్‌ దీపిక కుమారి వ్యక్తిగత క్వాలిఫికేషన్ పోటీ పడనుంది. ఆ తర్వాత పురుషుల సింగిల్స్‌ అర్చరీలో అతాను దాస్‌, ప్రవీణ్‌, తరుణ్‌దీప్‌ తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. స్థానిక ప్రేక్షకులకు ప్రారంభోత్సవ వేడుకలకు అనుమతి లేదు. టోక్యో ఒలింపిక్స్‌ ప్రారంభోత్స వేడుకలు భారత కాలమానం ప్రకారం ఉదయం  4:30 గంటలకు ప్రధాన స్టేడియంలో జరగనున్నాయి.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events