బ్రిటీష్ సింహాసనాన్ని రెండవ క్వీన్ ఎలిజబెత్ అధిరోహించి 70 ఏళ్లు అవుతుంది. ఈ నేపథ్యంలో ప్లాటినం జూబ్లీ సంబరాలను నిర్వహిస్తున్నారు. అత్యంత వైభవంగా వేడుకల్ని ప్రారంభించారు. బ్రిటీష్ చరిత్రలోనే ఎన్నడూ జరగని రీతిలో ఆ సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. నాలుగు రోజుల పాటు సంబరాలను ఘనంగా నిర్వహించనున్నారు. దీనిలో భాగంగా ట్రూపింగ్ ద కలర్ ఈవెంట్ ప్రారంభమైంది. క్వీన్ అధికారిక పుట్టిన రోజు సందర్భంగా మిలటరీ పరేడ్‌ను నిర్వహిస్తున్నారు. ప్రిన్స్ చార్లెస్ సైనిక వందనం స్వీకరించారు. ప్రిన్స్ విలియమ్‌తో పాటు పిల్లలు గుర్రపు బగ్గీలో లండన్ వీధుల్లో విహరించారు. బకింగ్‌హామ్ ప్యాలెస్‌ను సర్వాంగ సుందరంగా అలకరించారు. ప్రస్తుతం రెండవ క్వీన్ ఎలిజబెత్‌కు 96 ఏళ్లు. అత్యంత సుదీర్ఘ కాలం బ్రిటీష్ సింహాసనాన్ని ఏలిన మహారాణిగా ఆమె నిలిచారు.
