కెనడాలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. టీఆర్ఎస్ కెనాడా విభాగం అధ్యక్షుడు కృష్ణ కోమండ్ల మాట్లాడుతూ సీఎం కేసీఆర్ సబ్బండ వర్గాలను ఏకం చేసి 14 ఏండ్లు పోరాడారని, ప్రాణాలను సైతం లెక్కచేయకుండా తెగించి కొట్టాడటంతో 60 ఏండ్ల స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేరిందన్నారు. కేసీఆర్ తన చాణక్య నీతితో దేశంలోని రాజకీయ పార్టీలన్నింటిని ఒప్పించి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించారని తెలిపారు. అమరుల త్యాగాలు వెలకట్టిలేనివని 12 వందల మంది విద్యార్థులను బలి తీసుకున్న చరిత్ర నాటి పాలకులదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా పోరాడి స్వరాష్ట్ర ఆకాంక్ష నెరవేర్చడమే లక్ష్యంగా టీఆర్ఎస్ పార్టీ ముందుండి పోరాడిరదని నాటి ఉద్యమ రోజులను గుర్తు చేసుకున్నారు. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను రాష్ట్రంలో నెలకొల్పుతున్నాయని తెలిపారు. దీంతో వేల కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి తరలి వచ్చాయని, యువతకు వేల సంఖ్యలో ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. ఈ సందర్భంగా పలువురు ఎన్ఆర్ఐలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ వేడుకల్లో భారీ సంఖ్యలో ఎన్ఆర్ఐలు పాల్గొన్నారు.