స్కిల్ డెవలప్మెంట్ కేసులో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఎన్ఆర్ఐ టీడీపీ గల్ఫ్ కౌన్సిల్ సభ్యుడు వెంకట్ కోడూరి అధ్యక్షతన కువైట్లో టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలు నిజం గెలవాలి- ధర్మం నిలబడాలి పేరిట సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కష్ట సమయంలో టీడీపీకి నైతిక, రాజకీయ మద్దతు ప్రకటించిన జనసేన నాయకులు, కార్యకర్తలతో తమ ఆనందాన్ని పంచుకునేందుకు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఇరు పార్టీల నేతలు, కార్యకర్తలు ఒకరికొకరు స్వీట్లు పంచుకున్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పత్తి సుబ్బారాయుడు, హరి రాయల్, చంద్ర శేఖర్, అలీ, గ్రంథీ ప్రసాద్, ఎన్ఆర్ఐ టీడీపీ బీసీ సంఘం అధ్యక్షులు శంకర్ యాదవ్, సీనియర్ నాయకులు గుండయ్య నాయుడు, టీడీపీ నాయకులు వెనిగాళ్ళ బాల కృష్ణ, ప్రధాన కార్యదరిశ మల్లి మారోతు, కోశాధికారి మోహన్ రాచూరి, అస్మా, హవాల్లి గవర్నరేట్ కో ఆర్డినేటర్లు ముస్తాక్, రెడ్డయ్య చౌదరి, మహిళా నాయకురాలు నారాయణమ్మ, అంజలి, శివ గుండ్రాతి, తిరుపతి రాజు, రవి మలిసెట్టీ, శ్రీను, మహేష్ పాల్గొన్నారు