కోవిడ్ సెకండ్ వేవ్ ఉధృతి నేపథ్యంలో కేంద్రం అంతర్జాతీయ ప్రయాణాలపై ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. దాంతో పలువురు విదేశీయులు భారత్‌లో చిక్కుకుపోయారు. భారత్‌లో చిక్కుకుపోయిన విదేశీయులకు కేంద్రం ఊరట కలిగించింది. వారి వీసాల గడువును సెప్టెంబర్ 30 వరకు పొడిగించింది. ఇందుకు గాను విదేశీయులు ఎలాంటి అదనపు రుసుమును చెల్లించాల్సిన అవసరం లేదు. భారత్‌లో కరోనా విజృంభించిన తొలినాళ్ల నుంచి విదేశీయుల వీసాల గడువును కేంద్రం పొడిగిస్తున్న విషయం తెలిసిందే. సాధారణ వీసా లేదా ఈ`వీసా కలిగిన వారు ఎలాంటి ఓవర్ స్టే పెనాల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని పేర్కొంది.