Namaste NRI

కేంద్ర కేబినెట్ సమావేశం

యేడాది తర్వాత కేంద్ర కేబినెట్ ప్రత్యక్షంగా సమావేశమైంది. ప్రధాని మోదీ అధికారిక నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును అందించారు. వారి డీఏ (కరువు భత్యం) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 17 శాతంగా ఉంది. దీనిని 28 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఏకంగా 11 శాతం డీఏ పెంచడంపై ఉద్యో్గులు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై 34,401 కోట్ల మేరకు భారం పడుతుందని, కానీ ఈ నిర్ణయం వల్ల 48.34 లక్షల మంది ఉద్యోగులు లాభపడతారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా డీఏలను కేంద్రం నిలిపేసిన విషయం తెలిసిందే. పెరిగిన డబ్బులను నవంబర్ నుంచి పెరిగిన డీఏతో జీతాలు అందుతాయని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురును అందించారు. వారి డీఏ (కరువు భత్యం) పెంచుతూ కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర ప్రసార శాఖా మంత్రి అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల డీఏ 17 శాతంగా ఉంది. దీనిని 28 శాతానికి పెంచుతూ కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా లాంటి క్లిష్ట సమయంలో ఏకంగా 11 శాతం డీఏ పెంచడంపై ఉద్యో్గులు హర్షం వ్యక్తం చేశారు. డీఏ పెంపు వల్ల ప్రభుత్వ ఖజానాపై 34,401 కోట్ల మేరకు భారం పడుతుందని, కానీ ఈ నిర్ణయం వల్ల 48.34 లక్షల మంది ఉద్యోగులు లాభపడతారని ఆయన పేర్కొన్నారు. కోవిడ్ కారణంగా డీఏలను కేంద్రం నిలిపేసిన విషయం తెలిసిందే. పెరిగిన డబ్బులను నవంబర్ నుంచి పెరిగిన డీఏతో జీతాలు అందుతాయని అనురాగ్ ఠాకూర్ ప్రకటించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events