
బీఆర్‌ఎస్ రజతోత్సవ సభ చలో వరంగల్ పోస్టర్‌ను బీఆర్‌ఎస్ యూకే ఆధ్వర్యంలో లండన్ బ్రిడ్జి వద్ద ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎన్‌ఆర్‌ఐ బీఆర్‌ఎస్ యూకే అధ్యక్షుడు నవీన్‌రెడ్డి మాట్లాడారు. ప్రపంచవ్యాప్తంగా ఎన్‌ఆర్‌ఐలు ఈ వేడుకల్లో పాల్గొంటున్నారని, రానున్న రోజుల్లో లండన్‌లో రజతోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ యూకే ఉపాధ్యక్షుడు సత్యమూర్తి చిలుముల, కార్యదర్శి రవిప్రదీప్ పులుసు, అడ్వైజరీ వైస్ చైర్మన్ గణేశ్ కుప్పాల, సభ్యులు పవన్ కల్యాణ్, అజయ్‌రావు గండ్ర పాల్గొన్నారు.
