Skip to main content

Namaste NRI

కేన్స్ లో సంచ‌ల‌నం…భార‌తీయ న‌టికి ఉత్త‌మ హీరోయిన్ అవార్డు

ఫ్రాన్స్‌లో జరుగుతున్న 77వ కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో కోల్‌కతాకు చెందిన అనసూయ సేన్‌ గుప్తా ఉత్తమ నటిగా పురస్కారాన్ని గెలుపొంది సంచలనం సృష్టించింది. ది షేమ్‌లెస్‌ చిత్రానికిగాను ఆమె ఈ అవార్డు అందుకుం ది. ప్రతిష్టాత్మక కేన్స్‌ అంతర్జాతీయ చలన చిత్రోత్సవంలో బెస్ట్‌ యాక్ట్రెస్‌ అవార్డు అందుకున్న తొలి భారతీయ మహిళగా అనసూయ రికార్డు సృష్టించింది. కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ముఖ్యమైన అన్‌సర్టెయిన్‌ రిగార్డ్‌ విభాగంలో ఆమె ఈ పురస్కారాన్ని దక్కించుకుంది.

ది షేమ్‌లెస్‌ చిత్రాన్ని బల్గేరియన్‌ దర్శకుడు కాన్‌స్టాంటిన్‌ బొజనోవ్‌ తెరకెక్కించాడు. ఈ సినిమాలో రేణుక అనే వేశ్య పాత్రలో నటించింది అనసూయ. ఓ పోలీసును చంపి ఢిల్లీ వేశ్య వాటిక నుంచి పారిపోయిన రేణుక సెక్స్‌ వర్కర్ల కమ్యూనిటీలో ఆశ్రయం పొందుతుంది. అక్కడ పరిచయమైన ఓ అమ్మాయితో ఆమె ప్రయాణం ఎలా సాగిందన్నదే ఈ చిత్ర కథ. అనసూయ సేన్‌గుప్తాకు అవార్డు రావడం పట్ల పలువురు భారతీయ నటులు ఆనందం వ్యక్తం చేశారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events