
వాసవీ క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో స్థానిక శ్రీమారి అమ్మన్ చైనాటౌన్ ఆలయంలో చండీ హోమం అత్యంత భక్తిశద్ధ్రలతో జరిగింది. ఈ సందర్భంగా నిర్వహించిన సామూహిక కుంకుమార్చన, అమ్మవారి మూల విరాట్టుకు ప్రత్యేక అభిషేక కార్యక్రమాల్లో సింగపూర్‌లోని ఆర్యవైశ్య కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

వాసవీ క్లబ్ మెర్లయన్ సింగపూర్ ఆధ్వర్యంలో తెలుగువారి పండగలు, ప్రత్యేక సందర్భాల్లో సాంస్కృతిక, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూ ప్రవాసులను ఒక్కతాటిపైకి తీసుకొస్తున్నారు. అన్ని కార్యక్రమాలను విజయవంతం చేస్తున్న ఆర్యవైశ్యులందరికీ అధ్యక్షుడు మురళీకృష్ణ, కార్యదర్శి సుమన్ రాయల, కోశాధికారి ముక్కా కిషోర్ కృతజ్ఞతలు తెలిపారు. కోర్ కమిటీ సభ్యులు ముక్కా కిషోర్, కిశోరె శెట్టి, స్వప్న మంచికంటి, మార్తాండ్, జయ కుమార్ పి. మకేష్ భూపతి, వినయ్ బత్నుర్, ఫణేశ్ ఆత్మూరి ఈ కార్యక్రమం విజయవంత కావడానికి సహకరించారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు తీర్థ, అన్న ప్రసాదాలను వితరణ చేశారు. దాతలు గాజులపల్లి అనిల్, దివ్యలను కమిటీ సభ్యులు సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు.

