సాటి మనిషి కష్టాన్ని గుర్తించింది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబేనని పలువురు ప్రవాసాంధ్రులు అన్నారు. అమెరికా రాజధాని మెట్రో ప్రాంతంలో భాను మాగులూరి ఆధ్వర్యంలో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ గోనుగుంట్ల కోటేశ్వరరావు ప్రవాసాంధ్రుల తల్లిదండ్రులు సత్కరించారు. ఈ సందర్బంగా గోనుంట్ల కోటేశ్వరావు, మన్నవ సుబ్బారావు, చల్లా జక్కి రెడ్డి, భాను మాగులూరి మాట్లాడారు. మానవ నాగరిక వికాసంలో పుస్తక పఠనం అత్యంత ప్రధానమైనదని చెప్పారు. మానవత్వంతో తెలుగుదేశం ప్రభుత్వం దివ్యాంగులు, వృద్ధులు, వితంతువులకు దేశంలో ఎక్కడ లేని విధంగా, పెన్షన్లు పంపిణీ చేస్తోంది. సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను సమన్వయం చేసుకుంటూ రాష్ట్రం ప్రగతి పథంలో పయనిస్తోంది. దివ్యాంగులకు పార్టీలో ప్రాధాన్యత నిచ్చారు. దివ్యాంగులకు నెలకు రూ.6 వేలు, 10 వేలు, 15 వేలు చొప్పున పింఛను ఇచ్చి ఆదుకుంటున్నారు. భగవంతుడు మనకిచ్చిన శక్తిని, యుక్తిని, సంపద, అధికారాన్ని సమాజ హితానికి ఖర్చు పెట్టాలి. మంచిపుస్తకం మంచి నేస్తంతో సమానం. అన్ని రకాల ఆధునిక ప్రసార మాధ్యమాల కన్నా పుస్తకం గొప్పదనేది అందరం గ్రహించాలి అని వక్తలుసూచించారు.

ఈ కార్యక్రమంలో చామర్తి శ్రావ, వనమా లక్ష్మీనారాయణ, బోనాల రామకృష్ణ, దొప్పలపూడి అరుణ్ కుమార్, నంబూరి చంద్రనాథ్, చల్లా సుబ్బారావు, పునుగువారి నాగిరెడ్డి, బండి సత్తిబాబు పాల్గొన్నారు.
















