స్కిల్ డెవలప్ మెంట్ స్కీం కుంభకోణం కేసులో మధ్యంతర బెయిల్ పై జైలు నుంచి విడుదలైన టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ తన 45 ఏండ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో ఏ తప్పూ చేయలేదని పేర్కొన్నారు. ఇప్పటి వరకూ తన రాజకీయ చరిత్రలో ఏ తప్పు చేయలేదు. చేయను. చేయనివ్వను. భవిష్యత్ లోనూ చేయబోనని చంద్రబాబు స్పస్టం చేశారు. నేను కష్టంలో ఉన్నప్పుడు రోడ్డు మీదకు వచ్చి సంఘీభావం తెలిపారు. మీరందరూ 52 రోజులుగా నాకు మద్దతు తెలిపారు. ఏపీలో, తెలంగాణలో, విదేశాల్లో మద్దతు తెలిపారు. నాకు సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. నేను చేసిన పనులతో లబ్ధి పొందిన వారంతా వచ్చి సంఘీభావం తెలిపారు. పవన్ కల్యాణ్ ఓపెన్‌గా బయటకు వచ్చి మద్దతు తెలిపారు. నాకు మద్దతు తెలిపిన పవన్ కల్యణ్ కు ధన్యవాదాలు.
హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు పెద్ద సంఖ్యలో వచ్చి మద్దతుగా నిలిచారు.మీరు చూపించిన అభిమానం జీవితంలో మరిచిపోను అని చంద్రబాబు పేర్కొన్నారు. నాకోసం మీరు పూజలు, ప్రార్థనలు చేశారు. మీరు చూపించిన అభిమానం నేను నా జీవితంలో మరిచిపోను సీపీఐ, కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు సంఘీభావం తెలిపారు. వారందరికీ ధన్యవాదాలు అని చెప్పి అక్కడ ఉన్న ప్రజలకు అభివాదం తెలుపుతూ కారెక్కారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో విజయవాడకు బయలుదేరారు.