టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు డీజీపీ సవాంగ్‌కు లేఖ రాశారు. కర్నూలు జిల్లా పెసరవాయి గ్రామంలో జరిగిన హత్యకు సంబంధించిన నిందితులను ఇప్పటి వరకూ ఎందుకు అరెస్ట్ చేయలేదని చంద్రబాబు ఆ లేఖలో ప్రశ్నించారు. బాధితుల కుటుంబ సభ్యులను, సాక్షులను కొందరు బెదిరిస్తున్నారని, తక్షణమే నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, వారికి రక్షణ కల్పించాలని కోరారు. కర్నూలు జిల్లా పెసరవాయి గ్రామంలో వడ్డు నాగేశ్వర్ రెడ్డి, ప్రతాప్‌రెడ్డిని వైసీపీ నేతలు హత్య చేశారని బాబు ఆరోపించారు. హింసాత్మక చర్యలకు పాల్పడుతున్న వారికి సమాజంలో చోటుండకూడదని చంద్రబాబు పేర్కొన్నారు.