తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలను అమెరికాలోని అన్ని పెద్ద నగరాలలో ఎన్నారై తెదేపా కార్యకర్తలు భారీ ఎత్తున నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ అభిమానులు, చంద్రబాబు అభిమానులు సమన్వయపరుచుకొని ఈ వేడుకలను జరిపారు. నార్త్ కెరొలినా రాష్ట్రంలోని షార్లెట్ నగరంలో చంద్రబాబు 72వ పుట్టినరోజు వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించారు. వేడుకల కోసం స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు పురుషోత్తం చౌదరి గుడే, ఠాగూర్ మల్లినేని ఆధ్వర్యంలో తెదేపా అభిమానులు సమావేశమై ఈవేడుకలను ఘనంగా జరిపారు.
